Header Ads

'ఊపిరి'కి ఫ్రెంచ్ నిర్మాతల ప్రశంసలు



నాగార్జున, కార్తీలు ప్రధాన పాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఊపిరి. నాగ్ లాంటి స్టార్ హీరో వీల్ చైర్ లోనే కనిపించే పాత్రలో నటించిన ఈ సినిమా, విడుదలైన దగ్గరనుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన ఊపిరి ఓవర్ సీస్ మార్కెట్ లో కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. 
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సినిమా సక్సెస్ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఫ్రెంచ్ మూవీ 'ద ఇంటచబుల్స్'కు రీమేక్ గా రూపొందిన ఊపిరి సినిమాపై ఒరిజినల్ సినిమా నిర్మాతలు ప్రశంసల జల్లు కురిపించారు. ఒరిజినల్ వర్షన్ ను మించే స్ధాయిలో ఊపిరి సినిమా తెరకెక్కిందంటూ ద ఇంటచబుల్స్ నిర్మాణ సంస్థ గౌమాంట్, ఓ ప్రకటన విడుదల చేసింది.
ఫ్రెంచ్ సినీ చరిత్రలోనే భారీ విజయాన్ని నమోదు చేసిన తమ సినిమా, భారత్ లో కూడా సంచలనం సృష్టిస్తుండటం పై వారు ఆనందం వ్యక్తం చేశారు. ఊపిరి టీంకు అభినందనలు తెలియజేశారు.

No comments