Header Ads

ఆ ప్రమాదంలో నేతాజీ చనిపోయి ఉండకపోవచ్చు!



న్యూఢిల్లీ: 1945 ఆగస్టు 18వ తేదీన జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చనిపోకపోయి ఉండవచ్చుననే వాదనలు మరోసారి వినిపిస్తున్నాయి. నేతాజీ అదృశ్యానికి సంబంధించి ఏళ్లుగా చర్చ జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు పూర్తి స్పష్టత రాలేదు. తాజాగా కొన్ని ఫైళ్లు బహిర్గతమైన విషయం తెలిసిందే. ఈ ఫైళ్లలో మాత్రం నేతాజీ విమాన ప్రమాదంలో మరణించారనే విషయమై ఓ స్పష్టత ఇవ్వలేక.. తిరిగి పాతప్రశ్ననే మిగిల్చాయని అంటున్నారు. విమాన ప్రమాదం నుంచి నేతాజీ బతికి బయటపడ్డారని అప్పట్లో కొన్ని వార్తా సంస్థలు తెలిపాయి. 1992 నాటి ఓ ఐదు పేజీల నోట్లో నేతాజీ బతికే ఉన్నట్లుగా వెల్లడించాయి. అలా వెల్లడించిన నోట్ పైన ఎలాంటి పేరు, తేదీ లేదు. అది ప్రభుత్వానికి ఓ వినతిపత్రం ఇచ్చినట్లుగా ఉంది. నాటి బెంగాల్ గవర్నర్ ఆర్జీ కేసీ కార్యాలయంలో విధులు నిర్వహించే పీసీ ఖర్ అనే ఉద్యోగి చెప్పిన ప్రకారం నేతాజీకి చెందిన మూడు పత్రికా కథనాలను గవర్నర్ కార్యాలయం పర్యవేక్షణ సిబ్బంది స్వీకరించింది. అందులోని ఓ కథనంలో 'భారత దేశ స్వాతంత్ర్యం కోసం నా గుండె రగులుతోంది. అహింసతో స్వాతంత్ర్యం రానట్లయితే మనం రెండేళ్లలో స్వాతంత్ర్యం తెచ్చుకోవాల్సిందే' అని నేతాజీ చెప్పినట్లు ఉందని తెలుస్తోంది. 1946 ఫిబ్రవరి నెలలో వెలువడిన కథనం మాత్రం నేతాజీ భారత మాత గౌరవించదగిన పుత్రుడని తెలిపింది. అలాగే అసలు విమాన ప్రమాదం జరిగినట్లు ఆధారాలు లేవని, ఆయన అంత్యక్రియల నివేదిక సర్టిపికేట్ బోస్.. జపాన్ సైన్యంలో ఓ హోదా లేని ఉద్యోగి అని తెలిసిందని, చనిపోయిన వ్యక్తి పుట్టిన తేదీకి నేతాజీ పుట్టిన తేదీకి అస్సలు పోలిక లేదని పేర్కొంది.

No comments